Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: hyderabad

Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !
Telangana

Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !

Sports University |  హైదరాబాద్ : ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్ర‌క‌టించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంతర్జాతీయ కోచ్‌లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎన్‌ఎండిసి హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తరహాలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. అతను ఇటీవల దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా, సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించానని, ఇది ఒలింపిక్ పతక...
SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..
Telangana

SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

SCR Special Trains | సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌ , ఒడిశాలోని క‌టక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ - కటక్‌ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. ప్ర‌త్యేక‌ రైళ్ల షెడ్యూల్ ఇదే.. SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు ప్రతి మంగళ, బుధవారాల‌లో ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయని మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ రైళ్లు బయలుదేరే సమయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.హైదరాబాద్‌ - కటక్‌ (07165) రైలు మంగళవారం, కటక్‌ -హైదరాబాద్‌ (07166) రైలు బుధవారంహాల్టింగ్ స్టేష‌న్లు.. సికింద్రాబాద్‌, నల్ల‌గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్ల...
South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్..  సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..
Telangana

South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..

South Central Railway Updates | హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్‌ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్‌-హైదరాబాద్‌ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి.ఇక సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07766), కరీంనగర్‌-బోధన్‌ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894), నవంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు బోధన్‌-కరీంనగర్‌ మెము (07893), కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765) రద్దు అయ్యాయి. అలాగే  నవంబర్‌1నుంచి 30 వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చ...
Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
Telangana

Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Hyderabad| తెలంగాణ రాష్ట్ర‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల‌ను వేగవంతం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై కలెక్టర్లు ఇక నుంచి రోజూవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్యన‌ అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలన...
Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై  బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు
Telangana

Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు

Telangana | రైతు రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల‌క (Bhatti Vikramarka) వ్యాఖ్య‌లు చేశారు. రుణాల మాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని అన్నారు. హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని బ్యాంక‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం ఇప్ప‌టి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రంగం రాష్టాన్రికి వెన్నెముకగా భావిస్తున్న‌ద‌ని తెలిపారు. వ్యవ‌సాయానికి మ‌ద్ద‌తిచ్చేందుకు రుణమాఫీ (Rythu Runamafi ), రైతు భరోసా, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రూ.36వేల కోట్ల విలువైన  ఎంఓయూలు ఉచితంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, రెండు లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని చెప్పారు. ఇవి వ్యవసాయం అన...
RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు
Telangana

RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

హైదరాబాద్‌ ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు (RRR ) ‌ప్రాజెక్టుకు కావ‌ల‌సిన భూసేకరణ కు మొద‌టి ప్రాధాన్యం ఇచ్చి సెప్టెంబర్‌ ‌రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైద‌రాబాద్ లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ... హైద‌రాబాద్ లోప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం అత్యధిక ప్రాముఖ్యత‌ను ఇస్తోంద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ‌సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్ర‌క్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.RRR కింద భూములు...
Amazon Web Services | హైద‌రాబాద్ లో అమెజాన్ విస్తరణ.. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు
Telangana

Amazon Web Services | హైద‌రాబాద్ లో అమెజాన్ విస్తరణ.. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు

Amazon Web Services | అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధుల‌ బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లోనే ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ కూడా ప్రారంభించింది. తెలంగాణ‌లో వేగంగా విస్త‌ర‌ణ‌ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు (Amazon Web Services -AWS) సంబంధించి హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలత...
TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు
Andhrapradesh

TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు

TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్ర‌యాణికుల సౌకర్యార్థం కొత్త‌గా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC) ప్రకటించింది. టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులు కాచిగూడ స్టేషన్, జైలు గార్డెన్, సూపర్‌బజార్, దిల్‌సుఖ్‌నగర్, ద్వారకానగర్, ఎల్‌బీ నగర్ ఎక్స్ రోడ్, పనామా, భాగ్యలత, హయత్‌నగర్, ఎల్‌ఆర్ పాలెం, పెద్ద అంబర్‌పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నడుస్తాయి.కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌కు మొదటి బస్సు ఉదయం 6:10 గంటలకు, చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు, అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కాచిగూడకు మొదటి బస్సు ఉదయం 7:20 గంటలకు, చివరి బస్సు 9 :50 pmగంటలకు బయలుదేరుతుంది. మార్గంలో బస్సుల ఫ్రీక్వెన్సీ 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి బస్సు సర్వీసులు పవిత్ర శైవ క్షేత్రమైన ...
Vizag Vande Bharat Express |  విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..
Telangana

Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..

Vizag Vande Bharat Express | హైదరాబాద్‌ : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది.దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేవి.విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ...
Cognizant | తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ
World

Cognizant | తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ

న్యూ జెర్సీ (అమెరికా) : ఐటి రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి పొందిన కాగ్నిజెంట్ (Cognizant)కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్ర‌క‌టించింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు కల్పించేలా కొత్తగా మ‌రో సెంటర్ నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఐటీ నిపుణులు, నిరుద్యోగులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 వేల మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను నిర్మించ‌నున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. సోమ‌వారం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సంస్థ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య‌ ఒప్పందం కుదిరింది. ఈ క్ర‌మంలో హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రం ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుటికే అనేక‌ కొత్త సంస్థలు, ఐటీ కంపెన...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..