2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది?
How many seats will BJP win? | ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు సుర్జిత్ భల్లా, ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 2019 లో సాధించిన సీట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుర్జిత్ భల్లా వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో 330 నుంచి 350 సీట్లు గెలుచుకోగలదని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 303 సీట్లు సాధించగా బీజేపీ మిత్రపక్షాలు 353 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది." సుర్జిత్ భల్లా మాట్లాడుతూ.. బీజేపీ సొంతంగా 330 నుంచి 350 సీట్లు సాధిస్తుందని తెలిపారు. ఇది కేవలం 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఐదు నుంచి ఏడు శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలకు ఎన్ని సీ...