Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా
Haryana Municipal Election Results 2025: గురుగ్రామ్, సిర్సా, ఫరీదాబాద్, పానిపట్, అంబాలా, సోనిపట్ సహా పలు జిల్లాల్లో జరిగిన హర్యానా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం (మార్చి 12) వెల్లడయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 10 మేయర్ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురుగ్రామ్, హిసార్, కర్నాల్, రోహ్తక్, ఫరీదాబాద్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్‌లలో విజయాలు సాధించింది. మానేసర్ మాత్రమే మినహాయింపు, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ బిజెపి అభ్యర్థిని ఓడించారు.మానేసర్, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్, వార్డు సభ్యుల పదవులకు మార్చి 2న ఎన్నికలు జరగగా, పానిపట్ మేయర్ ఎన్నిక మార్చి ...