Group 1 Exams: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్..
Group 1 Mains Exams: తెలంగాణలో సోమవారం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. సోమవారం నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 563 పోస్టులకు 31, 382 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదటి పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.కాగా గ్రూప్ 1 అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. కాగా జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష పేపర్ల తరల...