
ఈ మహిళ నిజాయితీకి హ్యాట్సాఫ్.. రైలులో తన గొర్రె పిల్లలకు కూడా టికెట్ తీసుకుంది..
రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఎవరేం పట్టించుకోలరులే అనుకొని టికెట్ లేకుండానే దర్జాగా రైలెక్కుతారు.
రైలులో టీసీ (టికెట్ కలెక్టర్) వచ్చిప్పుడు చూసుకుందాంలే.. అని తేలికగా తీసుకుంటారు. ఈ విధంగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనం టికెట్ లేకుండానే తమ గమ్యస్థానాల్లో దిగి పోతుంటారు. అయితే రైళ్లలో మనుషులకే టికెట్ తీసుకోని నేటి కాలంలో రోజుల్లో.. ఓ వృద్ధురాలు.. తన పెంపుడు జంతువులకు కూడా లైలు టికెట్ తీసుకుని తన నిజాయితీని చాటుకుంది.
ఒక వృద్ధురాలు తను పెంచుకుంటున్న రెండు మేకలతో రైలు ఎక్కింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చిన ఆ మహిళను టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె టీసీకి టికెట్ చూపించింది. టికెట్ ను చూసిన టీసీ..ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
టీసీకి ఇచ్చిన టికెట్ లో ముగ్గురికి టికెట్ తీసుకున్నట్లు కనిపించగా వెంటనే టీసీ ఆమెను ప్రశ్నించాడు....