Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచలన విషయాలు..
Fourth Phase Election| నాలుగో విడత లోక్ సభ ఎన్నికల్లో 96 నియోజకవర్గాల్లో 58 (60%) నియోజకవర్గాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నట్లయితే అలాంటి చోట రెడ్ అలర్ట్ ఉంటుంది. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( Association For Democratic Reforms - ADR) ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, లోక్‌సభ ఎన్నికల్లో 4వ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మంది అభ్యర్థులు, మొత్తం 1,710 మంది అభ్యర్థుల్లో 360 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.మే 13న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేస్తున్న 1,717 మంది అభ్యర్థుల్లో 1,710 మంది స్వీయ ప్రమాణ పత్రాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. ADR నివేదిక ప్రకారం, మొత్తం 360 (21%) మంది అభ్యర్థులు క్రి...