అరెస్ట్ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
Arvind Kejriwal Bail : హర్యానా ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిస్తూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఆరు నెలల తర్వాత ఆప్ చీఫ్ ఇప్పుడు జైలు నుంచి విడుదల కానున్నారు. ఆ తర్వాత జూన్‌లో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మద్యం కుంభకోణం విషయంలో సీబీఐ అరెస్టు సరైనదేనని, సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే విచారణ సందర్భంగా సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని పేర్కొంది. విచారణ ప్రక్రియ అనేది శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని సుప్రీమ్ కోర్టు అభిప్రాయపడింది.
CBI పంజరంలో ఉన్న చిలుక అనే భావనను తొలగించాలి. అది పంజరం లేని చిలుక అని చూపించాలి. అనుమాన...