Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీకి (Biryani) డబ్బులు ఇవ్వలేదని 17 ఏళ్ల యువకుడిని ఓ కుర్రాడు కత్తితో పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతడిపై డ్యాన్స్ చేశాడు. బాధితుడైన 17ఏళ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) కాలి నడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో 16 సంవత్సరాల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినేందుకురూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు.
అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగా ఆవేశానికిలోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కింద పడిపోయిన బాధితుడిపై నిందితుడు కూర్చుని మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచి...