సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు
పాపులర్ బ్రాండ్స్ అన్నీ వీక్..
న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు గ్లోబల్ ఎన్ క్యాప్ వంటి సంస్థలు క్రాష్ టెస్ట్ లు నిర్వహించి వాటికి రేటింగ్ ఇస్తాయి.మన దేశంలో కూడా భారత్ ఎన్ క్యాప్ (Bharat NCAP ) టెస్టింగ్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్ కోసం ఇవ్వొచ్చు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాహన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్ ఎన్ క్యాప్ తోనే టెస్టి...