
Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు.ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి..
తెలంగాణ:
ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్(congress)క...