Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎన్ కౌంటర్.. 29 మంది నక్సల్స్ మృతి
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందారని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిదశ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతున్న క్రమంలోనే ఇంతటి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే బస్తర్ రీజియన్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు.ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృ...