ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు.
పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి.కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి ...