Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల
తెలంగాణలో దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ బ్రిడ్జి
Telangana Temples | రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, రామప్ప ఆలయాలతోపాటు ఇతర ప్రధాన ఆలయాల అభవృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రముఖ దేవస్థానాలు.. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామితి, యాదాద్రి దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ పలు కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్య...