TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్
TSRTC Electric Buses: తెలంగాణ వ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా, త్వరలో మిగతా రూట్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు.TSRTC Electric Buses : తెలంగాణలో అతి త్వరలో ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. డిసెంబర్ లో ఈ బస్సులు రోడ్లు ఎక్కనున్నాయి. ఇప్పటికే 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక చేస్తోంది.హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణం తీరును టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలి...