
G7 Summit | ‘నమస్తే’ అంటూ పలకరించున్న ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..
G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్థరాత్రి ఇటలీలోని అపులియా చేరుకున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. అయితే ప్రధానులిద్దరూ నమస్తే అంటూ పలకరించున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాగా ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో ప్రధాని నరేంద్...