Friday, January 23Thank you for visiting

Tag: bjp

Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?

Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?

Elections
Shyam Rangeela | ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేసి పాపుల‌ర్ అయిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్ల‌డించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి జూన్ 1న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. రంగీలా లోక్‌సభ 2024కి వారణాసి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు బుధవారం సోషల్ మీడియాలో ప్రకటించారు . కాగా 2014, 2019లో రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న మోదీ , మే 13న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శ్యామ్ రంగీలా ఎవరు? రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి పెరిగిన రంగీలా (Shyam Rangeela) యానిమేషన్ కోర్సు పూర్తిచేశారు. రంగీలా తన మిమిక్రీ తో బాగా పాల‌పుల‌ర్ అయ్యారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేస్తూ . 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'లో తన ప్రదర్శనలతో క...
Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) త‌మ‌కు ఓటు వేయ‌కుంటే క‌రెంట్ క‌ట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ స‌ర‌ఫ‌రా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేద‌ని తన వ్యాఖ్య‌ల‌కు కట్టుబడి ఉంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ ప‌రిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగ‌కుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్‌ కట్‌ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిప‌డింది. కాం...
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Elections
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో :  ఎఫ్ఐఆర్ నమోదు

ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు

Elections, National
Amit Shah Doctored Video | న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన‌ట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఫేక్ వీడియోను స‌ర్క్యులేట్ చేసిన‌వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు చేసింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ (BJP ) ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు వ్యాఖ్య‌ల‌ను వక్రీకరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మార్చార‌ని బీజేపీ ఆరోపించింది. బీజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. కాంగ్రెస్ X ఖాతాను బ్లాక్ చేసి దర్యాప్తు  ప్రారంభించాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం అధికారిని కోరింద...
కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

Elections, National
Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాల...
SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

Elections, National
Amit Shah | ల‌క్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..  ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌సింగ్‌కు మద్దతుగా నిర్వ‌హించిన ర్యాలీలో అమిత్‌ షా, కాంగ్రెస్‌ను 'అబద్ధాల ఫ్యాక్టరీ' అని అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.       రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అమ‌లు చేస్తుంద‌న్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రెండు పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీ ఉందని, కానీ నరేంద్ర మోడీ (PM Modi) రిజర్వేషన్‌కు మద్దతు తెలిపార‌ని గుర్తుచేశారు. రిజ‌ర్వేష‌న్ల‌ను బీజేపీ రద్దు చేయదన...
ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Elections
PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్ర‌భుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.మొదట లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుత...
Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Elections
Lok Sabha Elections Key contests 2024 |  18వ లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఏప్రిల్ 19న శుక్రవారం న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లు పాల్గొంటారు. తమిళనాడులో మొత్తం 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కటి 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 చొప్పున‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని సీట్ల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. తమిళనాడులో.. Lok Sabha Elections Key contests | తొలి దశ ఎన్నికల పోరులో పలువురు కీలక అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళనాడులో ద్...
Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

National
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోట‌లా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవ‌రిని నిలుపుతుంద‌నే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవ‌రు ఉంటారు అని విలేఖ‌రులు అడుగ‌గా, "ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూ...
BJP Manifesto 2024:  బీజేపీ మేనిఫెస్టో విడుదల..  ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్

National
BJP Manifesto 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వేదికపై బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జెపి నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా విక్షిత్ భారత్ సాధనపై దృష్టి కేంద్రీకరించామని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని ఇళ్లకు పైపులైన్ ద్వారా ఎల్పీజీ గ్యాస్, సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ అందించనున్నామని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తిపై దృష్టి సారిస్తుందని, ధరలను స్థిరీకరించడానికి , పేదల కోసం ఆయుష్మాన్‌ ...