Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు – దోషులకు క్షమాభిక్ష రద్దు
Supreme Court Quashes Gujarat Decision on Bilkis Bano Case : దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గుజరాత్ (Gujarat)కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుల్లో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టంచేసింది. 11 మంది నిందితులను రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలంటూ ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ మహారాష్ట్ర లో జరిగినందు వల్ల .. దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని త...