Madhya Pradesh | పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు, దెబ్బతిన్న ఈవీఎంలు..
Madhya Pradesh Loksabha Elections | మధ్యప్రదేశ్‌లోని బేతుల్ (BETUL) జిల్లాలో పోలింగ్ అధికారులతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తీసుకువెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అనేక EVMలు దెబ్బతిన్నాయని సీనియర్ అధికారి ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మే 7వ తేదీ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని గోలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవంశీ తెలిపారు.
ఈవీఎంలకు మంటలు
బస్సులోని నిప్పు రవ్వ కారణంగా మంటలు చెలరేగాయ తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదంలో బూత్ నంబర్లు 275, 276, 277, 278, 279, 280 సహా నాలుగు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు (EVM) దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఆరు పోలింగ్ పార్టీలు, సమాన సంఖ్యలో ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఈవీఎంలు చె...