Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ కవరేజ్..
Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. "70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు" అని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి? 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణ కవరేజీ కోసం ఆయుష్మ...