దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..
U-WIN Portal Key features | గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు పూర్తి టీకా రికార్డు కోసం వ్యాక్సిన్ సేవలను డిజిటలైజ్ చేసేందకు వచ్చే అక్టోబర్‌లో ఆన్‌లైన్ వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ U-WINని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వెల్లడించారు. ఈ పోర్టల్ ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన పనిచేస్తోంది. గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు వ్యాక్సినేషన్, మందులకు సంబంధించిన శాశ్వత డిజిటల్ రికార్డును నిర్వహించడానికి పోర్టల్ అభివృద్ధి చేసినట్లు జేపీ నడ్డా చెప్పారు.మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకాన్ని విస్తరించడంతో సామాజిక-ఆర...