ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్
India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భారత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. ఇది 10 సంవత్సరాల క్రితం భారత్ 5వ స్థానంలో ఉండేది. పది సంవత్సరాల క్రితం, భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో చిన్న మార్కెట్‌గా ఉంది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది. US మరియు చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. నేడు, యుఎస్, చైనా అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్లుగా కొనసాగుతున్నాయి."అయితే, భారతదేశం బ్రెజిలియన్, ఇండోనేషియా దేశీయ మార్కెట్‌లను పక్కకు నెట్టి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంతో మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా అవతరిస్తోంది" అని OAG డేటా తెలిపింది. 10-సంవత్సరాల సగటు కంటే దేశీయ విమానయాన సీట్ల సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది....