ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు
Amit Shah Doctored Video | న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసినవారిపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు చేసింది.
ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ (BJP ) ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు వ్యాఖ్యలను వక్రీకరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మార్చారని బీజేపీ ఆరోపించింది. బీజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. కాంగ్రెస్ X ఖాతాను బ్లాక్ చేసి దర్యాప్తు ప్రారంభించాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం అధికారిని కోరింద...