Saturday, August 30Thank you for visiting

Tag: Andhra Pradesh

ఏపీ,  తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..  విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

Andhrapradesh
Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) ప‌రిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా న‌డిపిస్తున్నారు. అలాగే పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పనులు చేప‌డుతుండ‌డంతో మరో మూడు రైళ్ల‌ను దారి మళ్లించారు.పూజ సీజ‌న్ నేప‌థ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మ‌ధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల నేప‌థ్యంలో రెండు రైళ్ల‌ను రీషెడ్యూల్ చేశారు. వి...
YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Andhrapradesh
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక‌ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను త‌మ‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతార‌ని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు ద...
Anna Canteens | పేదలకు గుడ్ న్యూస్..  రేప‌టి నుంచే అన్న క్యాంటీన్స్ షురూ.. రూ.5కే టిఫిన్స్, భోజనం

Anna Canteens | పేదలకు గుడ్ న్యూస్.. రేప‌టి నుంచే అన్న క్యాంటీన్స్ షురూ.. రూ.5కే టిఫిన్స్, భోజనం

Andhrapradesh
Anna Canteens | ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. మొద‌టి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా మునిసిపాలిటీల్లో క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో మొట్ట‌మొద‌టి అన్న‌ క్యాంటీన్‌ ప్రారంభించనున్నారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.తెలంగాణ‌లో రూ.5కే భోజ‌నం అందిస్తున్నారు. ఇవి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ‌ ఆస్ప్ర‌త్రులు, బ‌స్టాండ్లతోపాటు జ‌నసందోహం ఎక్కువ‌గా ఉన్న ర‌హ‌దారుల కూడ‌ళ్ల వ‌ద్ద ప్ర‌స్తుతం అక్ష‌య‌పాత్ర పేరుతో కొన‌సాగుతున్నాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఇందిరా క్యాంటీన్ల (Indira canteens )ను ప...
TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు

TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు

Andhrapradesh
TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్ర‌యాణికుల సౌకర్యార్థం కొత్త‌గా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC) ప్రకటించింది. టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులు కాచిగూడ స్టేషన్, జైలు గార్డెన్, సూపర్‌బజార్, దిల్‌సుఖ్‌నగర్, ద్వారకానగర్, ఎల్‌బీ నగర్ ఎక్స్ రోడ్, పనామా, భాగ్యలత, హయత్‌నగర్, ఎల్‌ఆర్ పాలెం, పెద్ద అంబర్‌పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నడుస్తాయి.కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌కు మొదటి బస్సు ఉదయం 6:10 గంటలకు, చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు, అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కాచిగూడకు మొదటి బస్సు ఉదయం 7:20 గంటలకు, చివరి బస్సు 9 :50 pmగంటలకు బయలుదేరుతుంది. మార్గంలో బస్సుల ఫ్రీక్వెన్సీ 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి బస్సు సర్వీసులు పవిత్ర శైవ క్షేత్రమైన ...
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రారంభ తేదీ? కావాల్సిన పత్రాలు ఇవే

AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రారంభ తేదీ? కావాల్సిన పత్రాలు ఇవే

Andhrapradesh
AP Free Bus Scheme | ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించే అవకాశం ఉన్న‌ది. ఏపీఎస్ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప‌థ‌కం అమ‌లు విష‌య‌మై సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులు తమ నివేదికను అందజేశారు.తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తీరును అధికారులు ఇప్ప‌టికే అధ్యయనం చేశారు. ఈ నేప‌థ్యంలో ఉచిత బస్సు సౌకర్యం నిబంధనలపై ప్రభుత్వం చర్చించనుంది.అధికారిక వర్గాల ప్రకారం, APSRTC నెలకు దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎదుర్కొంటుంది. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా. ఎంపిక చేసిన కేటగిరీ సర్వీసుల్లోనే ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులు అభిప్రాయపడుత...
Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు

Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు

Andhrapradesh
Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుతం కాకినడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారుఇ. త్వరలోనే రాష్ట్రమంతా కూడా రాగులు అంద చేస్తున్నారు. ఇక మీదట రేషన్ కి వెళ్లినప్పుడు అన్నిటితో పాటుగా రాగులు కూడా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. రాగులు ఎలా ఇస్తున్నారు..? Ration Card New Benifits : రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే కుటుంబం లో ఎంతమంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 3 ...
AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.

AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.

Andhrapradesh
AP Yuva Nestham | ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని నిరుద్యోగులు అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే వీరి కోసమే ప్రభుత్వం తాజాగా ఒక స్టెప్ వేసింది. ఐతే నిరుద్యోగ భృతి పొందడానికి ఏపీలో నిరుద్యోగులంతా ఏం చేయాలి.. దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం.ఏపీలో నిరుద్యోగుల కోసం యువ నేస్తం స్కీం ను ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే నెలకు 3000 రూ.లు వారికి అందిస్తుంది. ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఇది అమలు చేసేలా చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నిరుద్యోగులు తమకు కవాల్సిన బుక్స్ ఇంకా రిక్రూట్ మెంట్ పరీక్షలను రాసే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండేలా ప్రభుత్వం ఈ బృతి అందిస్తుంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.. నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధికార పోర్టల్ ( http://www.yu...
Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Andhrapradesh
Amrut Bharat Station Scheme | కేంద్ర‌ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించిన‌ట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివ‌రించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టేష‌న్ల వివ‌రాలు తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ...
Budget 2024 – Andhrapradesh :  కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Andhrapradesh, Business
Budget 2024 - Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని...
Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Andhrapradesh
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు బీహార్...