Anna Canteens | ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా మునిసిపాలిటీల్లో క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.
తెలంగాణలో రూ.5కే భోజనం అందిస్తున్నారు. ఇవి ప్రస్తుతం ప్రభుత్వ ఆస్ప్రత్రులు, బస్టాండ్లతోపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న రహదారుల కూడళ్ల వద్ద ప్రస్తుతం అక్షయపాత్ర పేరుతో కొనసాగుతున్నాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఇందిరా క్యాంటీన్ల (Indira canteens )ను ప్రారంభించింది. అయితే గతంతో టీడీపీ హయాంలో ఏపీలో చాలాచోట్ల ఇలాంటి క్యాంటీన్లను ఏర్పాట్లు చేశారు. కేవలం రూ.5కే ఆహారాన్ని అందించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీటిని కొనసాగించలేదు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200 వరకు అన్నా క్యాంటిన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలు ఎక్కువగా కనిపించే కూడళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఈ క్యాంటిన్ల ఏర్పాట్లు చేస్తారు. అన్న క్యాంటీన్లను రీ ఓపెన్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అన్నా క్యాంటీన్ల (Anna Canteens) లో మెనూ ఇదే..
సోమవారం
- బ్రేక్ ఫాస్ట్ రూ.5
- ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
- లంచ్/డిన్నర్ రూ.5
- వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
మంగళవారం
- బ్రేక్ ఫాస్ట్
- ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
- లంచ్/డిన్నర్
- వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి
బుధవారం
- బ్రేక్ ఫాస్ట్
- ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
- లంచ్/డిన్నర్
- వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి
గురువారం
- బ్రేక్ ఫాస్ట్
- ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
- లంచ్/డిన్నర్
- వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
శుక్రవారం
- బ్రేక్ పాస్ట్
- ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
- లంచ్/డిన్నర్ట్ రైస్, కూర, పప్పు/
- వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
శనివారం
- బ్రేక్ ఫాస్ట్
- ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
- లంచ్/డిన్నర్
- వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
#AndhraPradesh #AnnaCanteens #CBN #ChandrababuNaidu #Cabinet pic.twitter.com/aIqa5oeSGJ
— LAKSHMISRINIVAS ARAVELLI (@AaLaSreee) August 14, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..