lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వరకు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేస్తారని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్యక్తిని ఎంచుకుంది.గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయగా 26 సంవత్సరాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు
అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో ప...