Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ చేసే అపరిమితమైన అధికారాల కారణంగా వక్ఫ్ బోర్డు వేల కోట్ల విలువైన 9.4 లక్షల ఎకరాలను తన గొడుగు కిందకు తెచ్చుకుంది. కాంగ్రెస్ హయాంలో UPA-2 వక్ఫ్ చట్టం ప్రకారం అదనపు అధికారాలను కట్టబెట్టింది. తద్వారా వక్ఫ్ బోర్డు నుంచి నుంచి భూమిని తిరిగి పొందడం ఎన్నటికీ అసాధ్యంగా మారింది. ప్రభుత్వ భూములపై క్లెయిమ్ చేసే కేసులు సం...