అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ..
న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి, రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు.సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి ఈజిప్ట్ పర్యటన వివరాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ప్రధాని మోదీ క్లిప్‌ను ట్యాగ్ చేస్తూ, "నా ఈజిప్టు పర్యటన ఒక చారిత్రాత్మకమైనది. ఇది భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.’’ అని పేర్కొన్నారు
ఈజిప్ట్ అత్యున్నత గౌరవం
ఈజిప్టు అత్యున్నత గౌరవాన్ని(Egypt's Highest Honour) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీ ...