Airtel festive Season Offer | ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..
Airtel festive Season Offer | ఎయిర్‌టెల్ దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. దీని హై-స్పీడ్ డేటా కనెక్టివిటీ మెరుగైన సర్వీస్ తో 39 కోట్ల మంది వినియోగదారులకు తరచూ ఆకర్షనీయమైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. కాగా పండుగ సీజన్ సందర్భంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మూడు రీఛార్జ్ ప్లాన్‌లతో వివిధ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పండుగ ఆఫర్ రిలయన్స్ జియోతో పాటు Vodafone Idea, BSNL తో పోటీ పడుతోంది.Airtel ఫెస్టివ్ ఆఫర్ ప్రత్యేకంగా సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 979, రూ. 1029, రూ. 3599 రీఛార్జ్ ప్లాన్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్
రూ. 979 రీచార్జి ప్లాన్ లో కస్టమర్‌లు 84 రోజుల వాలిడిటీ, ప్రతిరోజూ 100 ఉచిత SMS, 84 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్, 84 రోజుల పాటు 168 GB డేట...