Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గతంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధనను తొలగించారు. కొత్త రూల్ ప్రకారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ సర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే సరిపోతుంది.
నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించకపోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది.
లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించకపోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల
స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భాగస్వామి, అవివాహిత లేదా నిరుద్యోగ కుమార్తెతో సహా అతనిపై ఆధారపడిన వారు పెన్షన్ బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక సంవత్సరం సమయం ఉంటుంది.
ఒక సంవత్సరం తర్వాత దరఖాస్తు చేసినట్లయితే, కొత్త నిబంధనల ప్రకారం, సంబంధిత బ్యాంకు తుది నిర్ణయం కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు కేసును ఫార్వార్డ్ చేస్తుంది.
ఇక డిపెండెంట్ పెన్షన్లు ఇప్పుడు దరఖాస్తు సమర్పించిన తేదీకి బదులుగా అసలు పెన్షనర్ మరణించిన తేదీ నుండి చెల్లింపులు చేస్తారు. డిపెండెంట్ పెన్షన్‌లు పొందుతున్న వారు పునర్వివాహం తర్వాత కూడా వాటిని పొందేందుకు గతంలో అనుమతించే నిబంధనను కూడా రక్షణ మంత్రిత్వ శాఖ తొలగించింది.