Monday, March 17Thank you for visiting

Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

Spread the love

New Unified Pension Scheme | పెన్షన్ ప‌థ‌కం విషయంలో మోదీ (PM Modi) ప్రభుత్వం సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ ల‌భిస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది. ఈ యూపీఎస్ పథకం (New Unified Pension Scheme) ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం 2025 ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

READ MORE  Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

కొత్త పెన్ష‌న్ స్కీమ్ పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav ) మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ చెల్లిస్తార‌ని వివ‌రించారు. అలాగే సర్వీసులో 25 ఏళ్లు పూర్తయిన వారికి కేంద్రం ఈ పూర్తి పెన్షన్ ప‌థ‌కం తీసుకువచ్చింది. బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. అలాగే 11,12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు కేంద్ర‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

READ MORE  Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..

డాక్టర్ సోమనాథన్ కమిటీ.. దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో సంప్రదింపులు జరిపిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు సైతం ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఇక ఉద్యోగుల పెన్షన్ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించార‌ని చెప్ఆప‌రు. కమిటీ సిఫారసు మేరకు యూనిఫైడ్ పింఛన్‌ స్కీమ్‌కు ఆమోదించిన‌ట్లు చెప్పారు. ఇక 25 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి పూర్తి పింఛ‌న్ వస్తుందని కేంద్రం పేర్కొంది. 10 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన వారికి రూ.10 వేల పెన్షన్ ల‌భిస్తుందన్నారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్‌ ఇస్తారని మంత్రి వెల్లడించారు.

READ MORE  దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?