Maruti Suzuki Dzire : మారుతి సుజుకీ డిజైర్ కారు గురించిం అందరికీ తెలిసిందే.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు ఇప్పుడు సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ డిజైర్ 2024 ను నవంబర్ 11న లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి సుజుకి వెబ్‌సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.
మారుతి కార్లు మిగతా వాటికంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే మారుతి కార్లు బిల్ట్ క్వాలిటీ విషయంలో మిగతా వాటి కంటే కాస్త బలహీనంగా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ జపాన్ NCAP ద్వారా 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను అందుకుంది. అయితే, కొత్త డిజైన్ ఇటీవల గ్లోబల్ NCAP రేటింగ్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్ రేటింగ్ అందుకుకుని చరిత్ర సృష్టించింది. అయితే, చైల్డ్ సేఫ్టీలో మాత్రం 4-స్టార్ రేటింగ్ సాధించింది. 5-స్టార్ రేటింగ్ అందుకున్న తొలి మారుతి కారుగా డిజైర్ రికార్డు నెలకొల్పింది.
కొత్త డిజైర్ ఫీచర్లు..
కొత్త మారుతి సుజుకీ డిజైర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.79 kmpl మైలేజీ, AMT బాక్స్‌తో 25.71 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక CNG వేరియంట్‌లు ఏకంగా 33.73 km/kg వరకు మైలేజ్ ఇస్తుంది.
2024 Maruti Suzuki Dzire వేరియంట్‌లు
సరికొత్త డిజైర్ స్విఫ్ట్ అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి LXI, VXI, ZXI మరియు ZXI+. ఆఫర్‌లో ఆటోమేటిక్ ట్రిమ్‌లు కూడా ఉంటాయి. అయితే, బేస్-స్పెక్ LXI వేరియంట్‌లో ఆటోమేటిక్ ఎంపిక అందుబాటులో ఉండదు. ఫ్యాక్టరీకి అమర్చిన CNG కిట్ VXI, ZXI వేరియంట్‌లలో మాత్రమే అందిస్తోంది
మొత్తం 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి గాలంట్ రెడ్, బ్రౌన్, ఆల్యూరింగ్ బ్లూ, బ్లూయిష్ బ్లాక్, మాగ్మా గ్రే, ఆర్కిటిక్ వైట్ స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.