Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) కు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ‘మై మేడారం యాప్’ (Medram app) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది భక్తులకు ఒక గైడ్‌గా ఉపయోగపడనుంది. ఈ యాప్ సాయంతో జాతర పరిసరాల్లోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్రదేశాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు తదితర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసే కేంద్రాలు, అగ్నిమాపక కేం ద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కాగా నెట్వర్క్ లేకపోయినా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క-సారలమ్మ మహా జాతర జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి జాతరకు సుమారు కోటి 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక మంత్రి సీతక్క అన్ని తానై మేడారం సమ్మక్క సారక్క జాతరలోనే ఉంటూ ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల వరకు 33 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బస్టాండ్‌తో పాటు.. 14వేల మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..