Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహనాల పార్కింగ్ పై కీలక ఆదేశాలు
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఊరటనిచ్చేలా షాపింప్ మాల్స్, మల్టీప్లెక్స్ లకు తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనాల పార్కింగ్ ఫీజులు (Parking Fees) వసూలు చేస్తున్న మాల్స్, మల్టీప్లెక్స్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలి కాటా (Amrapali Kata) గురువారం హెచ్చరించారు.
నిబంధనలను ఉల్లంఘించి థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్ కొనుగోలు రసీదు అందజేస్తే పార్కింగ్ ఉచితంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ మాల్స్‌లు వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బృందాలు గుర్తించాయి.
ఒకే స్క్రీన్‌గా రిజిస్టర్ అయిన ఒక థియేటర్ ప్రాంగణంలో మల్టీ స్క్రీన్‌లలో సినిమాలు ప్లే అవుతున్నట్లు కూడా తనిఖీ అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఈ మాల్స్‌లో విక్రయించే ఆహారం కూడా నాణ్యత లేనివిగా తేల్చారు. తనిఖీల్లో అక్రమాలకు పాల్పడుతున్న మాల్స్, మల్టీప్లెక్స్‌లకు కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.
ఇదిలా వుండగా దోమల నివారణకు కృషి చేయాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ పౌరులకు పిలుపునిచ్చారు. గురువారం బంజారాహిల్స్‌లోని పాఠశాలల్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలనీల్లో ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని కోరారు. అనంతరం డెంగ్యూ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యాన్ని, వారికి అందుతున్న చికిత్సను పరిశీలించారు. ఎన్‌బిటి నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజువారీ జ్వరపీడితుల రికార్డులను కూడా నాయక్ పరిశీలించి, సంబంధిత వైద్యాధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన పర్యటనలకు హాజరైన చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, డీఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ వెంకట్‌లు దోమల వృద్ధిని అరికట్టేందుకు, డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..