
Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహనాల పార్కింగ్ పై కీలక ఆదేశాలు
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఊరటనిచ్చేలా షాపింప్ మాల్స్, మల్టీప్లెక్స్ లకు తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనాల పార్కింగ్ ఫీజులు (Parking Fees) వసూలు చేస్తున్న మాల్స్, మల్టీప్లెక్స్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలి కాటా (Amrapali Kata) గురువారం హెచ్చరించారు.
నిబంధనలను ఉల్లంఘించి థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్ కొనుగోలు రసీదు అందజేస్తే పార్కింగ్ ఉచితంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ మాల్స్‌లు వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బృందాలు గుర్తించాయి.ఒకే స్క్రీన్‌గా రిజిస్టర్ అయిన ఒక థియేటర్ ప్రాంగణంలో మల్టీ స్క్రీన్...