మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు… హైద‌రాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్క‌రించాలి. శాశ్వతంగా, దీర్ఘ‌కాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేప‌డుతామ‌న్నారు

READ MORE  SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

ఈసీ, మూసీ నదులపై నార్సింగి నుండి గౌరెల్లి వరకు ఐదు కొత్త వంతెనలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో మూసీ నదిపై 4 లైన్లతో సుమారు రూ.168 కోట్ల వ్యయంతో ఐదు వంతెనలను పదిహేను నెలల లోపు నిర్మించాలని భావిస్తోంది. ఈసీ నదిపై బుద్వేల్ ఐటీ పార్క్ వద్ద 2 వంతెనలు, మూసీ నదిపై మంచి రేవుల వద్ద మూడవ వంతెన, మూసీ నదిపై హెచ్ఎండీఏ లేఅవుట్ ఉప్పల్ భగాయత్ వద్ద 4వ వంతెన, ప్రతాప సింగారం వద్ద 5వ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) సెప్టెంబర్ 25న సోమవారం ఉప్పల్ భగాయత్ వద్ద ఈ ఐదు వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు.

READ MORE  Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..

మూసీ, ఈసీ నదులపై నిర్మించే 5 బ్రిడ్జిలు

  • ఈసీ నదిపై రాజేంద్రనగర్‌-బుద్వేల్‌ ఐటీ పార్కు వద్ద వంతెన (180 మీటర్ల పొడవు, 4 లైన్లు, వ్యయం : రూ.19.83 కోట్లు)
  • ఈసీ నదిపై రాజేంద్రనగర్‌-బుద్వేల్‌ ఐటీ పార్కు వద్ద వంతెన (196 మీటర్ల పొడవు, 4 లేన్లు, వ్యయం: రూ. 20.64 కోట్లు)
  • మూసీ నదిపై మంచిరేవుల వద్ద హైలెవల్‌ బ్రిడ్జి (180 మీటర్ల పొడవు, 4 లైన్లు, వ్యయం రూ.32.21 కోట్లు)
    ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ వద్ద బ్రిడ్జి ( 210 మీటర్ల పొడవు, 4 లేన్లు, ఖర్చు రూ.29.28 కోట్లు )
  • ప్రతాపసింగారం వద్ద బ్రిడ్జి (210 మీటర్ల పొడవు, 4 లేన్లు, వ్యయం: రూ.26.94 కోట్లు)

5 వంతెనలు హెచ్ఎండీఏ, 14 వంతెనలు జీహెచ్ఎంసీ

Musi River Bridges  మూసీ, ఈసీ నదులపై నిర్మిస్తున్న 14 వంతెనల్లో 5 బ్రిడ్జిలను హెచ్‌ఎండీఏ నిర్మిస్తోంది. మిగతా 9 వంతెనలను జీహెచ్‌ఎంసీ నిర్మించనుంది. హెచ్‌ఎండీఏ నిర్మించనున్న 5 వంతెనలకు సంబంధించి అధికారులు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు. మంచిరేవుల, బుద్వేల్‌ ఐటీ పార్కు-1, బుద్వేల్‌ ఐటీ పార్కు-2, ఉప్పల్‌ భగాయత్‌, పత్రాప సింగారం లేఅవుట్‌ ప్రాంతాల్లో ఈ 5 వంతెనలు నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించిన పలు డిజైన్ లను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ క్రమంలోనే వంతెనల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ సెప్టెంబరు 25న సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.

READ MORE  తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *