Sunday, April 27Thank you for visiting

Tag: ktr

మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..

మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..

Telangana
Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు  బీజేపీ రంగంలోకి దిగింది.  దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా  బాధితులైనవారి తరఫున  తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్‌, అసెంబ్లీ, ముసారాంబాగ్‌, అం‌బేడ్కర్‌ ‌నగర్‌, ‌తులసి నగర్ ‌మీదుగా కృష్ణానగర్‌ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమ‌య్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ  కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని,...
తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు..  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

Telangana
Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులందరికీ అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లు ఉండేదని, ఈ పదేళ్ల కాలంలో ఆ అప్పు 24.05 శాతం పెరిగిందని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.3 లక్షల 89వేల 673 కోట్...
మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

Telangana
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు... హ...
హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…

హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…

Telangana
హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వారధులను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన (Steel Bridge) శనివారం అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక నాయకుడు, మాజీ మంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ఇందిరా పార్క్‌ చౌరస్తా (Indira Park) నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని వీఎస్టీ చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఫలితంగా ఆర్టీసీ క్రాస్‌రో డ్స్‌, అశోక నగర్‌, వీఎస్టీ (VST) జంక్షన్ల ప్రాంతంలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్నో ప్రత్యేకతలుదక్షిణ భారత దేశంలోనే ఇది మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి మరో ప్రత్యేకత ఉంది. మొదటిసార...
మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

Telangana
మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్‌ ఉందని మంత్రి కేటీ ఆర్‌ (KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. ఎలక్ట్రికల్‌ వాహన రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు ((E-Batteries)) దేశంలోనే తయారవుతాయన్నారు. గిగా కారిడార్ లో భాగంగా హైదరాబాద్ లోని జీఎంఆర్‌ ఏరో సిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నాని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric vehicles) కోసం జహీరాబాద్ పట్టణాన్ని ఎంపిక చేశామని తెలిపారు. యువ నైపుణ్యాలను ఒడిసిపట్టడంలో టీఎస్ ఐసీ కృషి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధన, డిజైనింగ్, ఇంజినీరి...
విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

Local
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపువరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీ...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..