Mata Vaishno Devi : మాతా వైష్ణో దేవి భక్తులకు శుభవార్త..

Mata Vaishno Devi Helicopter Service : మాతా వైష్ణోదేవికి వెళ్లే భక్తులకు గొప్ప శుభవార్త. ప్రతి 7 రోజులకు ఒకసారి భక్తుల కోసం హెలికాప్టర్ సేవను పునరుద్ధరించారు. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ కారణంగా హెలికాప్టర్ సర్వీస్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.. అయితే హెలికాప్టర్ సేవలను పునరుద్ధరించడానికి ఒక రోజు ముందు, జమ్మూ- శ్రీనగర్‌లకు విమానాలు పునరుద్ధరించారు.
సైనిక చర్యను నిలిపివేయడానికి రెండు పొరుగు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. “గత ఏడు రోజులుగా మాతా వైష్ణో దేవి ఆలయానికి (Mata Vaishno Devi Temple) హెలికాప్టర్ సర్వీస్ (Helicopter Service) రద్దు చేశారు. ఈ క్రమంలో ఉదయం నుండి తిరిగి ప్రారంభించామని ఆలయ నిర్వహణ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో యాత్రికుల సంఖ్యలో భారీ తగ్గుదల ఉందని, కానీ ఇప్పుడు అది మళ్లీ పెరుగుతోందని ఆయన అన్నారు. భక్తుల కోసం బ్యాటరీ కార్ సర్వీస్ కూడా ప్రారంభించామని సదరు అధికారి తెలియజేశారు.
ఇప్పటివరకు 30 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 30 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని సందర్శించారని, గత ఏడాది ఈ సంఖ్య 94.84 లక్షలుగా ఉందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెలికాప్టర్ సర్వీసు తిరిగి ప్రారంభించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.