Jaishankar | విదేశాంగ మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) భద్రతను పెంచారు. ఇప్పుడు ఆయన కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని(Bullet-resistant vehicle) చేర్చారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎస్ జైశంకర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఆయన ప్రధాని మోదీని నిరంతరం కలుస్తూ మొత్తం ప్రణాళికలో భాగమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, భయపడిన పాకిస్తాన్ భారత్ లోని అనేక ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈనేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా ఎస్ జైశంకర్ (Jaishankar) భద్రతను పెంచారు. దీంతో పాటు దిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. జైశంకర్ ఇప్పటికే CRPF కమాండోల నుంచి Z-కేటగిరీ భద్రతను పొందుతున్నారు. అక్టోబర్ 2023లో అతని భద్రత Y-కేటగిరీ నుండి Z-కేటగిరీకి అప్‌గ్రేడ్ చేశారు.
కేంద్ర మంత్రి భద్రత కోసం ఇప్పటికే 33 మంది కమాండోలు ఎల్లప్పుడూ మోహరించారు. విదేశాంగ మంత్రికి ఉన్న ముప్పును అంచనా వేసిన తర్వాత భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సిఫార్సు చేసింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి జైశంకర్ ఇంటి వద్ద భద్రత కోసం 12 మంది సాయుధ గార్డులను మోహరించారు. ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులు (PSOలు) కూడా ఉన్నారు. మూడు షిఫ్టులలో 12 మంది సాయుధ ఎస్కార్ట్ కమాండోలను మోహరించారు. ముగ్గురు వాచర్లు షిఫ్టులలో పనిచేశారు. శిక్షణ పొందిన ముగ్గురు డ్రైవర్లు అన్ని సమయాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు ఎస్. జైశంకర్ భద్రతను పెంచడానికి, బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా అందించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.