Posted in

Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

Malkajgiri railway station
Malkajgiri railway station
Spread the love

Amrit Bharat Station Scheme : రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద ‘నయ భారత్ నయ స్టేషన్’ చొరవలో భాగంగా చేపట్టిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ (Malkajgiri railway station) పునరాభివృద్ధికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటివరకు ప్రతిపాదిత అభివృద్ధి పనులలో దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. అదే సమయంలో, అన్ని పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మల్కాజ్‌గిరి స్టేషన్ పునరాభివృద్ధి కోసం సుమారు రూ. 27.61 కోట్ల నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ (Malkajgiri railway station) లో అభివృద్ధి పనులు పూర్తయ్యాక రైలు ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు . సికింద్రాబాద్ నుండి 3 కి.మీ దూరంలో ఉన్న స్టేషన్ ఆధునికంగా చూడగానే ఆకట్టుకునేలా ముఖభాగం, మెరుగైన కారిడార్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లును నిర్మిస్తున్నారు.

ఈ స్టేషన్‌ను ప్రయాణీకులకు అనుకూలమైన వివిధ సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు, వాటిలో విశాలమైన కాన్కోర్స్, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్ట్‌రూమ్‌లు ఉన్నాయి. దివ్యాంగ ప్రయాణీకులకు ప్రత్యేక టాయిలెట్లు, ర్యాంప్‌లు మొదలైన సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. తెలంగాణ అంతటా మొత్తం 40 రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

Malkajgiri రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులు :

  • Malkajgiri railway station స్టేషన్ భవనం ముఖభాగం సుందరీకరణ
  • ప్రవేశ ద్వారం ఏర్పాటు
  • FoB, లిఫ్టులు, ఎస్కలేటర్ల నిర్మాణం
  • ప్లాట్‌ఫామ్ ఫ్లోరింగ్ మెరుగుదలలు
  • వెయిటింగ్ హాళ్ల ఆధునికీకరణ
  • సర్క్యులేటింగ్ ఏరియాలో ల్యాండ్‌స్కేపింగ్, సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి
  • స్టేషన్ ప్రాంగణంలో కళ, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు శిల్పాల ఏర్పాటు
  • ప్రయాణీకులకు స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపించేలా సైన్ పోర్టులు,రైలు సూచిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *