Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైలకు ఓటు హక్కు ఉంటుందా?
Lok Sabha Elections : లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వస్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా పలు కీలకమైన ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలను తెలుసుకోవచ్చు..
పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా?
ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమతి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధనలు రూపొందించింది.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. “లేదు, పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్‌ల లోపల మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్, వైర్‌లెస్ సెట్లు మొదలైన వాటిని తీసుకెళ్లడం అనుమతించరు. అయితే, ప్రిసైడింగ్ అధికారులకు మాత్రం కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం తమ ఫోన్‌లను సైలెంట్ మోడ్‌లో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ఎన్నారైలకు ఓటు హక్కు ఉందా?
ఎన్నారైలకు ఓటు హక్కు ఉంటుంది., వారు మరే ఇతర దేశపు పౌరసత్వాన్ని పొందనంత కాలం.. భారతదేశంలోని వారి నివాస స్థలంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.
భారతదేశంలో పౌరుడు కాని వ్యక్తి ఓటరు కాగలరా?
లేదు, భారతదేశంలో ఓటు వేయడం కేవలం భారతీయ పౌరులకు మాత్రమే చాన్స్ ఉంటుంది. మరొక దేశ పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తులు ఓటు వేయడానికి లేదా నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు. ఇంతకు ముందు భారతీయ పౌరులుగా ఉండి, ఇప్పుడు వేరే దేశ పౌరసత్వం పొందిన వారు కూడా అర్హులు కాదు.
ఈసారి ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఎందరు?
ఈ లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడానికి అర్హులని భారత ఎన్నికల సంఘం తెలిపింది. భారతదేశంలో 96.88 కోట్ల మంది ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ పూల్ అని ఎన్నికల సంఘం నివేదించింది. కమిషన్ ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ఓటర్ల సంఖ్య ఆరు శాతం పెరిగింది.
ఎన్నికలు షెడ్యూల్ ?
Lok Sabha Elections లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కూడిన లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై ఏడు దశల్లో నిర్వహించబడతాయి, ఆ తర్వాత ఏప్రిల్ 26న తదుపరి దశలు జరుగుతాయి. మే 7, మే 13, మే 20, మే 25, మరియు జూన్ 1. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..