Saturday, August 30Thank you for visiting

Local

సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం

సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం

Local
18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్వీప్ ఓటరు నమోదు, ఓటు హక్కు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఓటురుగా నమోదైన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక కాంపెయిన్లో భాగంగా ఈ నెల 26 , 27వ తేదీల్లో అలాగే వచ్చే నెల 2, 3వ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెప...
శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి  శ్రావణ మాసోత్సవాలు

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Local
Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బు...
మొగిలిచర్ల లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల

మొగిలిచర్ల లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల

Local
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ వరంగల్ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని చారిత్రక మొగిలిచర్లలో సోమవారం స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ మంత్రి,  హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాలు జీవించి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ధ్రువ వతారగా నిలిచారని అన్నారు. ప్రపంచ యువజన హృదయ సామ్రాట్ గా విరాజిల్లుతున్నారని తెలిపారు. యువత సన్మార్గంలో నడవాలంటే వివేకానంద చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు.గ్రామంలో ఒకేసారి అబ్దుల్ కలాం, వివేకానంద విగ్రహావిష్కరణతో పాటు మతోన్మాది చేతిలో హత్యకు గురైన పూజారి దేవల సత్యనారాయణ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గొప్పవిషయమని, ఇది శుభ పరిణామమని కొనియాడారు. యువత సన్మార్గంలో ప్రయాణించి ఆదర్శ పురుషులుగా తయారు కావాలని ఆకాంక్షిం...
ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి 

ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి 

Local
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వరంగల్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని వరంగల్ జిల్లా పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హా లో రిటర్నింగ్ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, వర్ధన్నపేటకు సంబంధించి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీవో క్రిష్ణవేణి రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ బాధ్యతల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులకు వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, విధి విధానాలపై కలెక్టర్ వివిధ అంశాల వారీగా వివరించారు. జిల్లాలో ఎన్నికల విధుల ని...
రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

Local
హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండ...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

Local
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్లు బొక్క దయాసాగర్, వేముల నాగరాజు, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మసకపురి సుధాకర్, బొల్లారపు సదయ్యలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సభ్యుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ.. తుది జాబితాను రూపొందించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉన్న వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన కమిటీ..  అనుభవం ఉన్న జర్నలిస్టుల విషయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరించింది. తుది జాబితాకు సంబంధించిన భూ సేకరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సభ్యులకు తెలియజేశారు. వివిధ చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ జాగాలు చూసి ఫైనల్ చేసేందుకు మంత్రి, ఎంఎల్ఏతో కలసి ముందుకు సాగుతామని ప్రకటించింది. ...
నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు  

నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు  

Local
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత వారోత్సవాల్లో భాగంగా కొత్తవాడ అమరవీరుల స్థూపం నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేతన్నలు నేసిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకులు గొప్పగా మార్చుకునేందుకేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధిచిన తెలంగాణలో ఆ ఫలాలను నేడు నేతన్నలకు అందుతున్నాయన్నార...
వరంగల్ లో ‘కుడా’ భూముల వేలానికి సన్నాహాలు

వరంగల్ లో ‘కుడా’ భూముల వేలానికి సన్నాహాలు

Local
వరంగల్: హన్మకొండ-ధర్మసాగర్ రహదారిలోని ఉనికిచెర్ల గ్రామ సమీపంలో తొలిదశలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను ఆగస్టు 20న వేలం నిర్వహించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( Kakatiya Urban Development Authority ) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు . (ORR), సిటీ సెంటర్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల  దూరంలో ఉంది. కాగా KUDA యాజమాన్యంలోని మొత్తం భూమి 135 ఎకరాలు విస్తరించి ఉంది.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్లాట్ల మూల ధర (అప్సెట్ ధర) చదరపు గజానికి దాదాపు రూ.12,000గా అంచనా వేసినట్లు సమాచారం. అయితే బిడ్డర్లు చదరపు గజానికి రూ. 20,000 వరకు వేలం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నివాస ప్లాట్లు రెండు పరిమాణాలలో వస్తాయి.. అవి 200 చదరపు గజాలు (30×60) అలాగే 300 చదరపు గజాలు (45×60). ఈ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు 'యూని' సిటీ ( ‘Uni’ City) అని పేరు పెట్టారు.“నగరానికి దగ్గ...
నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

Local
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు.వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే నష్టంతో పాటు, తద్వారా దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యాపారస్తులకు వివరించి చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైన వాహనాల కొనుగోలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ము...
సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

Local
వరంగల్ పోలీసుల హెచ్చరిక వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద భారీ శబ్ధం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో భారీ శబ్బాలు వచ్చేలా సైలెన్సర్లను రీప్లేస్ చేస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.విరంగనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి ఆకతాయిలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.ఇందులో భాగంగా కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను ట్రాఫిక్ ప...