Home » కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి
Kerala's Muvattupuzha Snehaveedu deaths

కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

Spread the love

కేరళలో మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. ఐదుగురు వృద్ధ మహిళలు పాదాల కింద బొబ్బలు పెరగడంతోపాటు రక్తపు వాంతులతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడడం షాక్ గురిచేసింది.

కేరళలోని మువట్టుపుజా(Muvattupuzha)లోని స్నేహవీడు(Snehaveedu) అనే వృద్ధాశ్రమంలో రెండు వారాల వ్యవధిలో ఒక అంతుచిక్కని చర్మ వ్యాధి ఐదుగురు వృద్ధ మహిళలను బలిదీసుకుంది. స్నేహం ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (Sneham Charitable and Educational Trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు మహిళల మరణానికి ముందు ఇలాంటి లక్షణాలను కనిపించినట్లు స్థానికులు తెలపిారు. వారు వారి పాదాల కింద వాపు, బొబ్బలు వచ్చాయి. అది చివరికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. వారి చర్మం ఊడిపోయినట్ల కనిపించింది. తర్వాత వీరంతా రక్తపు వాంతులు చేసుకున్నారు.

READ MORE  Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఇవే లక్షణాలు కనిపించిన మరో ఆరుగురు బాధితులను మువట్టుపుజా జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ప్రస్తుతానికి, మువట్టుపుజా మునిసిపాలిటీ అధికారులు హుటాహుటిన అక్కడి వారిని తాత్కాలికంగా సురక్షిత కేంద్రాలకు తరలించారు. స్నేహవీడు ఆశ్రమాన్ని మూసివేసి, శానిటైజ్ చేశారు.

మొదట జులై 15న స్నేహవీడులో నివాసముంటున్న అలియమ్మ జార్జ్ (78) మృతి చెందడంతో పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశారు.
జూలై 19, 27 తేదీల్లో వరుసగా.. మరో ఇద్దరు మహిళలు ఈలీ స్కరియా (80), కమలం (72), జూలై 29న తుది శ్వాస విడిచారు. దీంతో పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 174 (అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక వ్యక్తి చనిపోతే విచారణ నివేదికను తయారు చేయడం) కింద రెండవ కేసు నమోదు చేశారు. మువట్టుపుజ ఇన్‌స్పెక్టర్ బైజూ పీఎం నేతృత్వంలోని బృందం జూలై 29న వృద్ధాశ్రమంలో తనిఖీలు నిర్వహించి ఇన్‌స్టిట్యూట్ నివాసితుల వాంగ్మూలాలను నమోదు చేసింది.

READ MORE  Hyderabad Metro | గుడ్ న్యూస్‌.. మెట్రో ప్ర‌యాణికుల‌కు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..

పోస్ట్‌మార్టం నివేదికలు ఇంకా విడుదల కాలేదు. అయితే మరణించిన వారి నుండి సేకరించిన నమూనాల ఆధారంగా ప్రాథమిక పరీక్ష ఫలితాలు క్లేబ్సియెల్లా న్యుమోనియా(Klebsiella pneumoniae), స్టెఫిలోకాకస్ ఆరియస్ (Staphylococcus aureus) వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మువాట్టుపుజా ఎమ్మెల్యే మాథ్యూ కుజల్‌నాదన్ లేఖ పంపారు.

జూలై 29 న మరణాలు మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన తర్వాత మునిసిపల్ అధికారులు వృద్ధాశ్రమంలో వ్యాధి వ్యాప్తి గురించి తమకు తెలియజేయలేదని ఆరోపించారు. స్నేహవీడు నిర్వహిస్తున్న స్నేహం ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ బినీష్ కుమార్ అయితే ఈ వాదనను తోసిపుచ్చారు. తాను ఆ వార్తను వార్డు కౌన్సిలర్, మృతుడి బంధువులకు తెలిపినట్లు వెల్లడించారు.

READ MORE  EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసంవందేభారత్ ను చూడండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..