KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!
KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు.
ఎగ్జిట్ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు బీఆర్‌ఎస్ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్, హరీశ్ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖను తన ఓఎస్డీతో లేఖను పంపారు. అనంతరం తన సొంత వాహనంలో ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారథిగా కేసీఆర్ ఆయన తిరుగులేని విజయాన్ని సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఘనత సాధించారు. ఆపై 2018 లోనూ ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఏకంగా 88 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో వరుసగా రెండోసారి కూడా కేసీఆర్ సీఎం పీఠం అధిష్టించారు. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన సేవలను అందించారు.
కామారెడ్డిలో షాక్..
మరోవైపు కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి (Kamareddy) నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రతీ రౌండ్ లోనూ ఉత్కంఠభరితంగా సాగిన కామారెడ్డి పోరులో చివరకు బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది.. సమీప ప్రత్యర్ధి కేసీఆర్ (KCR) పై స్థానిక బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి గెలుపొంది బీఆర్ఎస్ శ్రేణులకు గట్టి షాకిచ్చారు. అయితే సీఎం కేసీఆర్ తో పాటు మరో పార్టీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ నేత వెంకట రమణారెడ్డి (Venkata Ramana Reddy) తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు..
కాగా ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తోనూ కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీచేశారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. సీఎం కేసీఆర్ మూడో స్థానంలో నిలిచారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
News update 👌