Kavach 3.2 for Train Safety | దక్షిణ మధ్య రైల్వేలో రైలు భద్రత కోసం కవాచ్ 3.2 ఇన్ స్టాలేషన్
Kavach 3.2 for Train Safety | రైల్వేల భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 1200 కిలోమీటర్ల మేర స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన కవాచ్ కవచ్ ను ఇన్ స్టాల్ చేస్తోంది. ఇటీవల నాగర్‌సోల్ – ముద్ఖేడ్ – సికింద్రాబాద్ – ధోనే – గుంతకల్, బీదర్ – పర్లీ వైజనాథ్ – పర్భానీ మార్గాల్లో ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈసారి అత్యాధునిక కవాచ్ తాజా వెర్షన్ 3.2 అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.
లోకో పైలట్ రైలుకు బ్రేక్ వేయడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్‌లను ఉపయోగించి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లలో కవాచ్ సిస్టమ్ లోకో పైలట్‌కు సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడపడానికి కూడా ఉపయోగపడుతుంది. కాగా రైల్వే ఉన్నతాధికారులు ఆదివారం సికింద్రాబాద్-ఉందానగర్ సెక్షన్ మధ్య తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి సరికొత్త వెర్షన్ సిస్టమ్ పనితీరును పరిశీలించారు. ‘కవాచ్ టవర్స్’, ట్రాక్ సైడ్ పరికరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి పలు అంశాల పనితీరును పరిశీలించారు.
బ్లాక్ సెక్షన్‌లలో, అలాగే స్టేషన్‌లలో నడుస్తున్న లైన్లలో రైలు ఢీకొనకుండా ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్సర్ (ISA) ద్వారా కవాచ్ అత్యున్నత స్థాయి సేఫ్టీ ఫీచర్ ను కలిగి ఉందని ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ‘కవాచ్’ ప్రమాదంలో సిగ్నల్ పాస్యింగ్ (SPAD) సంఘటనలను కూడా తగ్గిస్తుంది. సమీప భవిష్యత్తులో జోన్ కవాచ్ వెర్షన్‌ను 4.0కి అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు చెబతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆదివారం ఉమ్దానగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. ప్రయాణీకుల సౌకర్యాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని సమీక్షించారు. భవిష్యత్ అవసరాలు డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఉమ్దానగర్ స్టేషన్ అభివృద్ధి ప్రణాళికల గురించి ఆయన చర్చించారు.
వందేభారత్ రైళ్ల అప్ గ్రేడ్
ఇదిలావుండగా భారతీయ రైల్వేలు ప్రస్తుతం అప్ గ్రేడ్ చేసిన కొత్త వందే భారత్ రైలు సెట్లు తక్కువ బరువుతో కూడిన ‘2.0’ వెర్షన్ (392 టన్నులు.. గతంలో కంటే 38 టన్నులు తక్కువ బరువు) ను ప్రారంభించింది. ఈ రైళ్లు మెరుగైన ఎయిర్ సస్పెన్షన్ తోపాటు ‘కవాచ్’ రక్షణతో ఉన్నాయి. రైలులో యాంటీ-వైరస్ క్లెన్సింగ్ సిస్టమ్, మూడు గంటల వరకు అధిక బ్యాటరీ బ్యాకప్, మెరుగైన ఎయిర్-కూలింగ్, గరిష్టంగా 180 kmph వేగంతో ప్రయాణిస్తుంది. గత వెర్షన్ 54.6 సెకన్లతో పోలిస్తే కొత్త రైళ్లు 52 సెకన్లలోనే 0 నుంచి 100 వరకు చేరుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కవర్ చేస్తూ 54 వందేభారత్ రైళ్లు (108 సర్వీసులు) నడుస్తున్నాయి. దాదాపు 36,000 ట్రిప్పుల్లో 3.17 కోట్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లాయి. ఆదివారం సెప్టెంబర్ 15న టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా మరియు గయా-హౌరా వందే భారత్ అనే ఆరు కొత్త సర్వీసులు ప్రధాని మోదీ ప్రారంభించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..