Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్ ఛార్జీలు, తాగునీటి చార్జీలు, మెట్రో ఛార్జీలను సైతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు.
ప్రస్తుతం బీరు మినహా మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని, బీరు ధరల పెంపుపై ఆలోచిస్తున్నామని, అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidha Ramaiah) తో చర్చించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. “మేము ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి, బీరు ధరను పెంచాలని ప్రతిపాదిస్తే, అది ఒక నిర్ధారణకు వచ్చే వరకు చర్చ దశలోనే ఉంటుంది, మేము దీనిపై పూర్తిస్తాయిలో చర్చించిన తర్వాత తది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
ఉచిత పథకాల భారం తగ్గించుకునేందుకు..
అనేక ఉచిత పథకాలు అమలు చేస్తుండడంతో అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ను పెంచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బీర్ ధరల పెంపు ఆలోచన తీవ్ర చర్చలకు దారితీసింది, ప్రత్యేకించి పౌరులు ఇప్పటికే వివిధ రంగాలలో పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు.
గతంలో, కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 2023 రాష్ట్ర బడ్జెట్‌లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై 20 శాతం ఎక్సైజ్ సుంకాన్ని, బీర్ ధరలను 10 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 2024లో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్ట్రాంగ్ బీర్’పై అధిక ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కోరింది. పన్నుల ప్రతిపాదన ఆమోదం పొందితే, కర్ణాటకలో కేవలం ఏడాది వ్యవధిలో బీర్ ధరలు పెరగడం (Beer Price Hike) ఇది మూడోసారి అవుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..