Home » Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే
IRCTC Sapta Jyotirlinga Yatra

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

Spread the love

IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో “సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర” టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు.

కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు..

  1. ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్),
  2. ద్వారకా (నాగేశ్వర్),
  3. సోమనాథ్ (సోమనాథ్),
  4. పూణే (భీక్మశంకర్),
  5. నాసిక్(త్రయంబకేశ్వర్),
  6. ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).

సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)

బోర్డింగ్ / డీ-బోర్డింగ్ స్టేషన్లు :

  • విజయవాడ,
  • మధిర
  • ఖమ్మం
  • డోర్నకల్ జంక్షన్
  • మహబూబాబాద్
  • వరంగల్
  • కాజీపేట
  • జనగామ
  • భువనగిరి
  • సికింద్రాబాద్
  • కామారెడ్డి
  • నిజామాబాద్
  • ధర్మాబాద్
  • ముద్ఖేడ్, నాందేడ్
  • పూర్ణ
READ MORE  Railway Fare | సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీ లభిస్తుందా? బడ్జెట్‌లో ఏం ఉండనుంది.?

IRCTC Sapta Jyotirlinga Yatra ధరలు

  • క్లాస్- డబుల్/ట్రిపుల్ షేర్ – పిల్లలు(5-11 సంవత్సరాలు)
  • ఎకానమీ- రూ.20590 – రూ.19255
  • స్టాండర్ట్ – రూ.33015 – రూ.31440
  • కంఫర్ట్ – రూ.43355 – రూ.41465/-

రోజుల వారీగా టూర్ కవర్ చేసే  స్థలాలు ఇవీ:

మొదటి రోజు : 17-08-2024 – విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్లలో ప్రయాణికుల బోర్డింగ్

రెండో రోజు : 18-8-2024 – మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ  రైల్వే స్టేషన్లలో – ప్రయాణికుల బోర్డింగ్

మూడో రోజు :  19-08-2024 –  ఈ రైలు ఉజ్జయిని రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఉజ్జయిని స్టేషన్ నుంచి హోటల్ కు  తీసుకువెళ్తారు. అనంతరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి ఉజ్జయినిలోనే బస చేయాలి.

నాలుగో రోజు :  20-08-2024  అల్పాహారం చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి బయలుదేరుతారు. అనంతరం ద్వారకాకు వెళ్లేందుకు.. తిరిగి ఉజ్జయిని రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

READ MORE  హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి

ఐదవ రోజు :  21.08.2024  ఈ రోజు ద్వారకా స్టేషన్ కు చేరుకుంటారు.  రైల్వేస్టేషన్ నుంచి నేరుగా హోటల్ తీసుకెళ్తారు. రాత్రికి ద్వారకాలోనే బస సౌకర్యం కల్పిస్తారు.

ఆరో రోజు :  22.08.2024 – బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ద్వారకాధీష్ ఆలయాన్ని దర్శించుకుంటారు.  ఆ తర్వాత హోటల్ నుంచి చెక్ ఔట్ చేసి, ద్వారకాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయానికి బయలుదేరతారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత సోమనాథ్‌కు వెళ్లేందుకు ఓఖా  స్టేషన్‌కు యాత్రికులను తీసుకువస్తారు.

ఏడో రోజు :  23-08-2024 – సోమనాథ్ స్టేషన్ చేరుకున్నాక అక్కడి నుంచి హోటల్ కు తీసుకెళ్తారు. హోటల్ లో  రీఫ్రెష్ అయిన తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకునేందుకు  బయలుదేరివెళ్తారు. అనంతరం రైలు మార్గంలో నాసిక్‌కి వెళ్లడానికి సోమనాథ్ స్టేషన్‌కు తీసుకువస్తారు.

ఎనిమిదో రోజు :  24-08-2024 – మహారాష్ట్రలోని నాసిక్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత .యాత్రికులను నాసిక్‌లోని హోటల్ కు తీసుకు వెళ్లి అక్కడ బస ఏర్పాటు చేస్తారు.

తొమ్మిదో రోజు : 25-08-2024 – అల్పాహారం చేసిన తర్వాత హోటల్ నుంచి బయలుదేరి నాసిక్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత పూణేకు వెళ్లడానికి నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

READ MORE  ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

10వ రోజు : 26.08.2024 – ఖర్ది స్టేషన్‌కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి హోటల్ కు తీసుకెళ్తారు. అనంతరం భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరుతారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌కు వెళ్లేందుకు పూణే స్టేషన్‌లో యాత్రికులను తీసుకువస్తారు.

11వ రోజు : 27.08.2024  – యాత్రికులు ఔరంగాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్ కు వెళ్లి చెక్ ఇన్ చేస్తారు. తర్వాత  గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి బయలుదేరుతారు.  స్వామివారి దర్శనం తరువాత సికింద్రాబాద్‌కు తిరుగు పయనమవుతారు. ఇందుకోసం  కోసం రైలెక్కేందుకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌లో యాత్రికులను తీసుకువస్తారు.

12వ రోజు  28.08.2024 – ఐఆర్ సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ముగింపు దశలో  ప్రయాణికుల డీబోర్డింగ్ ఉంటుంది.

భక్తులు, యాత్రికులు సప్త జ్యోతిర్లింగ దర్శనం టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..