Vikarabad Krishna Railway Line | వికారాబాద్ – క్రిష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై కీలక అడుగులు

Vikarabad Krishna Railway Line | వికారాబాద్ – క్రిష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై  కీలక అడుగులు
Spread the love

Vikarabad Krishna Railway Line : దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.  చాాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా  రైల్వే శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు అసెంబ్లీ విరామ సమయంలో లో సీఎం రేవంత్ ఆయన కార్యాలయంలో కలిశారు. కీలకమైన వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను ప్రదర్శించారు.

వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’  తుది ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,  మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే ప్రణికా రెడ్డి,  ఆర్అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

READ MORE  Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు 

మూడు జిల్లాలకు మేలు..

Vikarabad Krishna Railway Line : వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే.. వికారాబాద్‌ జిల్లాలో పరిధిలోని కొడంగల్‌, పరిగి,  అలాగే  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలోని నారాయణపేట, మక్తల్‌ ప్రాంతాల ప్రజలకు రైల్వే కనెక్టివిటీ వస్తుంది. ఈ రైల్వేలైన్‌ తో సమీప ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

READ MORE  చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *