Vikarabad Krishna Railway Line | వికారాబాద్ – క్రిష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై కీలక అడుగులు
Vikarabad Krishna Railway Line : దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. చాాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రైల్వే శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు అసెంబ్లీ విరామ సమయంలో లో సీఎం రేవంత్ ఆయన కార్యాలయంలో కలిశారు. కీలకమైన వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను ప్రదర్శించారు.వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' తుది ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు....