Posted in

Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

Maitri Setu
Maitri Setu
Spread the love

Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది.

అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్త‌యింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాక‌పోక‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాక‌పోక‌లు మొద‌లైన త‌ర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మ‌రో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవ‌ల‌ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు.

వంతెన ద్వారా సరుకుల ర‌వాణా ప్రారంభించడం త్రిపురకు మాత్రమే కాకుండా మొత్తం ఈశాన్య ప్రాంతానికి కూడా వ్యూహాత్మకంగా కీల‌క‌మైన‌దిగా నిల‌వ‌నుంది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవు త్రిపురలోని సబ్రూమ్ నుంచి కేవలం 80 కి.మీ దూరంలో ఉంది. ఇది మెరుగైన వాణిజ్య మార్గాలకు అవకాశం కల్పిస్తుంది. అదనంగా, కోవిడ్ మహమ్మారి కారణంగా మూసివేసిన త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని కమలాసాగర్ సరిహద్దు ప్రాంతం త్వరలో తిరిగి తెరుస్తామ‌ని గిట్టే ప్రకటించారు.

మైత్రి సేతు కీల‌కాంశాలు ( Key Facts about the Maitri-Setu) ..

  • మైత్రి సేతు భారతదేశంలోని త్రిపురలోని సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌గఢ్‌తో కలుపుతూ 1.9 కిలోమీటర్ల పొడవైన వంతెన.
  • ఇది ఫెని నదిపై నిర్మించబడింది, ఇది రెండు దేశాల మధ్య సరిహద్దునల‌ను క‌లుపుతుంది.
  • ఈ వంతెన భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తుంది..
  • మైత్రి సేతు అనేది ఒకే-స్పాన్ డిజైన్‌తో కూడిన ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ నిర్మాణం. ప్ర‌యాణికులు, స‌రుకు ర‌వాణాను ఈ వంతెన సుల‌భ‌త‌రం చేస్తుంది.
  • రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కింద నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) నిర్మాణాన్ని పర్యవేక్షించింది.
  • NHIDCL అనేది భారతదేశంలోని జాతీయ రహదారులు & రహదారుల అభివృద్ధి & నిర్వహణ కోసం 2014లో స్థాపించిన ప్రభుత్వ యాజమాన్య సంస్థ . ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కు చెందిన‌ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
  • ఈ వంతెన పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్, మోంగ్లా ఓడరేవుల ద్వారా ఈశాన్య భారతదేశానికి వస్తువుల రవాణాను అనుమతిస్తుంది.
  • ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాలలో ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది. భారతదేశ ఈశాన్య, బంగ్లాదేశ్ మధ్య ప్రజల సంబంధాలను పెంపొందిస్తుంది
  • మైత్రి సేతు వంతెన కోల్‌కతా నుండి చిట్టగాంగ్‌కు కొత్త సముద్ర మార్గాన్ని అందిస్తుంది, సిట్వే పోర్ట్-కలదాన్ మార్గానికి త్వరిత ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. ప్రాంతీయ అనుసంధానం, వాణిజ్యం, దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుంది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *