Tuesday, April 15Welcome to Vandebhaarath

ED raids in Jharkhand : మంత్రి స‌హాయ‌కుడి ఇంట్లో ప‌ట్టుబ‌డిన నోట్ల గుట్ట‌లు..

Spread the love

ED raids in Jharkhand | జార్ఖండ్‌ రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు సోమవారం అక‌స్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

జార్ఖండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) ప‌లు పథకాల అమలులో అక్ర‌మాలు జ‌రిగాయి. ఈ వ్య‌వ‌హారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో గత సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో గ్రామీనాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమ‌వారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఒకేసారి వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడైన‌ సంజీవ్ లాల్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్టుబడిన నగదు విలువ సుమారు రూ.25 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగిస్తున్నారు.

READ MORE  ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

ED raids in Jharkhand : ఈడీ దాడులపై స్పందించిన ఆలం, దర్యాప్తు సంస్థ ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నందున వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. “సంజీవ్ లాల్ ప్రభుత్వోద్యోగి. అతను నా వ్యక్తిగత కార్యదర్శి. సంజీవ్ లాల్ ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మేము సాధారణంగా అనుభవం ఆధారంగా వ్యక్తిగత కార్యదర్శులను నియమిస్తాం. దీనిపై వ్యాఖ్యానించడం సరికాదు. అని తెలిపారు.
కాగా జార్ఖండ్ బిజెపి అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో అవినీతి అంతం కావడం లేదని, అవినీతి సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

READ MORE  Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

ఇదిలా ఉండ‌గా రాంచీలోని సెయిల్ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం, ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం ED బృందం సెయిల్ సిటీలో గాలిస్తోంది. మరో ఈడీ బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *